Ganjayi Mattuలో యువకులు హల్‌చల్.. బెంబేలెత్తిన జనం

ABN , First Publish Date - 2022-11-18T13:10:08+05:30 IST

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు నానా హంగామా సృష్టించారు. సోనియాగాంధీ నగర్‌లో గంజాయి మత్తు(Ganjayi Mattu)లో యువకులు హల్‌చల్ చేశారు

Ganjayi Mattuలో యువకులు హల్‌చల్.. బెంబేలెత్తిన జనం
బెంబేలెత్తిన జనం

మేడ్చల్: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు నానా హంగామా సృష్టించారు. సోనియాగాంధీ నగర్‌లో గంజాయి మత్తు(Ganjayi Mattu)లో యువకులు హల్‌చల్ చేశారు. మహిళలను, చిన్నారులను ఇళ్లల్లోంచి బయటకు రాకుండా భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో స్థానికులు హడలిపోయారు. కుషాయిగూడ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మత్తులో ఉన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ నగర్‌లో గస్తీని పెంచాలని స్థానికులు ఈమేరకు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని జనం వాపోయారు.

Updated Date - 2022-11-18T13:10:08+05:30 IST

Read more