మాటలకు పరిమితం కావొద్దు..

ABN , First Publish Date - 2022-05-28T08:38:31+05:30 IST

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ అవినీతిపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ మాటలకు పరిమితం కావద్దని టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల

మాటలకు పరిమితం కావొద్దు..

-కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరిపించండి: పొన్నాల

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ అవినీతిపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ మాటలకు పరిమితం కావద్దని టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ఆయన అవినీతిపై విచారణకు ఆదేశించాలని కోరారు. అన్ని దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్న మోదీ దర్యాప్తునకు ఆదేశించకుండా విమర్శలతో సరిపెట్టడం సరికాదన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు కేసీఆర్‌ తప్పించుకుని పొరుగు రాష్ట్రానికి వెళ్లడం దుర్మార్గమన్నారు. ఢిల్లీకి వెళితే ప్రధాని అపాయింట్‌మెంట్‌ లేదని చెబుతున్న కేసీఆర్‌.. ఆయనే  స్వయంగా ఇక్కడికొస్తే లేకుండా పోవడం దొంగ రాజకీయమేనని చెప్పారు. అవినీతి సొమ్ముతో దేశ పర్యటనలు చేస్తున్న చిల్లర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటూ దుయ్యబట్టారు. తెలంగాణకు వచ్చిన మోదీ ఇక్కడి సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ అంశాలపై మాట్లాడడం దుర్మార్గమన్నారు. 

Updated Date - 2022-05-28T08:38:31+05:30 IST