కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్ర స్టేట్‌మెంట్‌పై జనం నవ్వుకుంటున్నారు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-07-18T02:37:52+05:30 IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కమిషన్ల వర్షం కురిపించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బాహుబలి మోటార్లు, పంప్ హౌస్‌లు

కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్ర స్టేట్‌మెంట్‌పై జనం నవ్వుకుంటున్నారు: విజయశాంతి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కమిషన్ల వర్షం కురిపించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బాహుబలి మోటార్లు, పంప్ హౌస్‌లు భారీ వర్షాలకు వరదనీటిలో మునిగిపోయాయని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. లండన్, ఇస్తాంబుల్ ఇంకా ఏవేవో చేస్తానని తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రజలకి ఆయనిచ్చిన వాగ్దానాల్లోని డొల్లతనాన్ని ఈ వానలు బట్టబయలు చేశాయన్నారు. తాజా పరిణామాలతో కేసీఆర్‌కు మైండ్ బ్లాంక్ అయినట్టు క్లౌడ్ బరస్డ్ కుట్ర స్టేట్‌మెంట్ ద్వారా అర్థమైందని రాములమ్మ అన్నారు. తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశాల హస్తం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని విజయశాంతి చెప్పారు.
గతంలో కేసీఆర్ తన దత్తత గ్రామం వాసాలమర్రి పర్యటన సందర్భంగా వెళ్లిన గ్రామాలకే పదే పదే వెళ్లి, ఇచ్చిన హామీలే ఇస్తూ అభాసుపాలైనప్పుడు ఆయన బుర్రలో చిప్ ఖరాబైందని, జ్ఞాపకశక్తి కోల్పోయి అందరినీ ఇబ్బంది పెడుతున్నారని తాను చెప్పిన విషయాన్ని విజయశాంతి గుర్తు చేశారు. తన వ్యాఖ్యలు నిజమని తాజాగా మరోసారి రుజువైందన్నారు. 


Read more