విష్ణువర్దన్ కాంగ్రెస్‌లోనే ఉంటారు: VH Hanumantha Rao

ABN , First Publish Date - 2022-07-05T22:13:04+05:30 IST

Hyderabad: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్దన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. విఘ్ణవర్దన్ తన ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. విందుకు హాజరైన హనుమంతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ..

విష్ణువర్దన్ కాంగ్రెస్‌లోనే ఉంటారు:  VH Hanumantha Rao

Hyderabad: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత పీ జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్దన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని పార్టీ సీనియర్ నేత  వి.హనుమంతరావు పేర్కొన్నారు. విఘ్ణవర్దన్ తన ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. విందుకు హాజరైన హనుమంతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 


‘‘పీజేఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాత్రీపగలు కష్టపడ్డారు. ఆయన కొడుకు విష్ణువర్దన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్. కాంగ్రెస్ ఒకరి సొత్తు కాదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి‌ని  సోనియాగాంధీ అపాయింట్ చేసింది. ఆయన నాయక్వత్వాన్ని బలపరుస్తున్నాం. కానీ రేవంత్ కూడా అందరిని కలుపుకుపోవాలి. నా ఇష్యూ‌పై హైకమాండ్‌తో మాట్లాడతా. నా విషయం ఇక్కడ మాట్లాడితే నాకు నేనే అవమానపర్చుకున్నట్టే. అందరికి అప్పీల్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసి పనిచేద్దాం.’’ అని వీహెచ్ పేర్కొన్నారు.

 

‘‘పి. జనార్దన్ రెడ్డి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలవని వారుండరు. తన తండ్రి జ్ఞాపకార్ధం విష్ణు కాంగ్రెస్ నేతలను పిలిచారు. పీజేఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కోసం పోరాడారు. హైదరాబాద్‌లో ఉన్న నిరుపేదలకు  ఇళ్ల స్థలాలు ఇచ్చారు. విష్ణు తండ్రికి తగ్గ తనయుడు’’ అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్  కొనియాడారు. 

టీఆర్ఎస్, బీజేపీవి తెరచాటు నాటకాలు 

‘‘రాహుల్ గాంధీ నాయక్వత్వం‌లో మనమంతా పని చేయాలి. కాంగ్రెస్‌ పార్టీలోకి రావడానికి చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. పార్టీ‌ని నమ్మి పని చేసిన వారికి అన్యాయం జరగదు. టికెట్ కోసమే వచ్చి పని‌చేసే వారికి ప్రాధాన్యం ఉండదు. ఇక్కడి నుంచి వెళ్లిన వారు తిరిగి రావాలని అనుకుంటున్నారు. 8 సంవత్సరాలు‌గా పార్లమెంట్‌లో ప్రధానిని ఏనాడు ప్రశ్నించని వ్యక్తి కేసీఆర్. కాంగ్రెస్ బలోపేతాన్ని అడ్డుకోవడానికి తెరచాటున  ఉన్న వ్యక్తులు ప్రతిఘటిస్తున్నట్టు నాటకం ఆడుతున్నారు.  బీజేపీ, టీఆర్ఎస్ కలిసే ఉన్నాయి. ఈ కుట్రను ప్రజలు గమనించాలి. ’’ - మధు యాష్కీ

Updated Date - 2022-07-05T22:13:04+05:30 IST