Bundi Sanjay, KCRపై ఆగ్రహం వ్యక్తం చేసిన VH
ABN , First Publish Date - 2022-06-02T19:20:16+05:30 IST
బండి సంజయ్, సీఎం కేసీఆర్‌పై వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: బీజేపీ (BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bundy Sanjay), సీఎం కేసీఆర్ (KCR)పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఇక్కడ గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ మతాల పేరిట రెచ్చగొట్టే రాజకీయం మానుకోవాలన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిపై ఎవరూ చెయ్యి వేయరని, అక్కడ సంతకాలు చేసిన వారితో తమకు సంబంధం లేదన్నారు. తమ పార్టీ వారైతే చర్యలు తీసుకోవాలని కోరుతానన్నారు. గజ్వేల్‌కు ప్రధాని మోదీ వస్తే ప్రేమ ఉంటే చాలన్న కేసీఆర్‌కు ఏడు మండలాలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు. కలిపిన నాడు పార్లమెంట్లో ఏం చేశారని నిలదీశారు. ఇప్పటికైనా కేసీఆర్‌కు అమరుల స్థూపం గుర్తుకు రావడం సంతోషమని వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు.