మాజీ వీసీ ప్రవీణ్‌రావుకు సన్మానం
ABN , First Publish Date - 2022-08-04T05:32:59+05:30 IST
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ
రాజేంద్రనగర్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సరల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన డాక్టర్ వి.ప్రవీణ్‌రావును వర్సిటీలోని ఆయన నివాసంలో బుధవా రం వర్సిటీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు కలసి సన్మానించారు. శా లువ, పూలమాలతో సన్మానించి శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. ప్రవీణ్‌రావును సన్మానించిన వారిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వి.సత్తయ్య గౌడ్, ఉపాధ్యక్షులు ఎం.నాగులు, షేక్ ముబీనా, గౌరవ అధ్యక్షుడు ఎస్.పెంటయ్య, తదితరులు ఉన్నారు.