వారాహి.. టీఎస్‌ 13 ఈఎక్స్‌ 8384

ABN , First Publish Date - 2022-12-13T03:19:18+05:30 IST

కొద్దిరోజులుగా ఏపీలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల మంటలకు కారణమైన పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’ రిజిస్ట్రేషన్‌ పూర్తయింది........

వారాహి.. టీఎస్‌ 13 ఈఎక్స్‌ 8384

పవన్‌ ప్రచార వాహనానికి డిసెంబరు 9నే రిజిస్ట్రేషన్‌ పూర్తి

వాహనం రంగును ఎమరాల్డ్‌ గ్రీన్‌గా నిర్ధారించాం: పువ్వాడ

హైదరాబాద్‌/సిటీ, డిసెంబరు 12: కొద్దిరోజులుగా ఏపీలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల మంటలకు కారణమైన పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’ రిజిస్ట్రేషన్‌ పూర్తయింది! వైసీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నట్లు ఆ వాహనం రంగు ఆర్మీ వాహనాలకు వాడే ఆలివ్‌ గ్రీన్‌ కాదని.. ఎమరాల్డ్‌ గ్రీన్‌ అని తెలంగాణ రవాణా శాఖ తేల్చి, టోలీచౌకీ రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసింది. ఆ వాహనానికి టీఎస్‌ 13 ఈఎక్స్‌ 8384 అనే నంబరు కేటాయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. డిసెంబరు 9న హైదరాబాద్‌ టోలీచౌకీ ఆర్టీఏ కార్యాలయం నుంచి ఈ రిజిస్ట్రేషన్‌ జరిగిందని ఆయన వివరించారు. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలనూ పరిశీలించామని, వాహనం రంగును ఎమరాల్డ్‌ గ్రీన్‌గా నిర్ధారించి ఆర్సీ మీద ఆ వివరాలు ముద్రించామని మంత్రి వెల్లడించారు. వాహనాల రంగులకు కోడ్‌లు ఉంటాయని.. భారత ఆర్మీ ఉపయోగించే కలర్‌ కోడ్‌, ఈ వాహనం కలర్‌ కోడ్‌ వేర్వేరుగా ఉన్నాయని, దీని రంగు నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేశారు. వాహనం రంగుపై ఎలాంటి అభ్యంతరాలూ లేవని తేల్చిచెప్పారు.

Updated Date - 2022-12-13T03:19:18+05:30 IST

Read more