కలుషిత నీరు తాగిఇద్దరి మృతి!
ABN , First Publish Date - 2022-12-15T03:16:42+05:30 IST
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో కలుషిత నీరు తాగి ఇద్ద రు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆరు నెలల చిన్నారి సహా ఐదుగురికి అస్వస్థత
రాజేంద్రనగర్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో కలుషిత నీరు తాగి ఇద్ద రు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవుపల్లి డివిజన్ పరిధిలోని మొఘ ల్స్ కాలనీలో రెండు రోజుల వ్యవధిలో వేర్వేరు కుటుంబాలకు చెందిన మహ్మద్ ఖైసర్(28). అఫ్రీన్ సుల్తానా(25) మరణించారు. అఫ్రీన్ సుల్తానా కూతురు ఫైజ్ బేగం(ఆరు నెలలు)తోపాటు కాలనీకి చెందిన సమీరా బేగం(35), షహజాదీబేగం (30), ఆర్.పి సింగ్(43), అజారుద్దీన్(15), మహ్మద్ గౌస్ (65) అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు ఆస్పత్రి పా లై ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. పది రోజుల క్రితం కాలనీకి సరఫరా అయిన మంచినీటిని తాగడం వల్ల చాలామంది అ స్వస్థతకు గురయ్యారని, వారిలో ఇద్దరు మరణించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీలో మురుగునీటి ప్రవాహం కూ డా సమస్యను పెంచిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కాలనీని బుధవా రం సందర్శించి వివరాలు సేకరించారు. అయితే ఇది అవాస్తవమని జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. కలుషితమైన నీరు సరఫరా జరుగుతుందంటూ ఆరు నెలలుగా త మకు ఎలాంటి ఫిర్యాదు అందలేని, మృతులు అనారోగ్యం వల్లే ప్రాణాలు కోల్పోయి ఉంటారని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఈ నెల 8న సేకరించిన నీటి శాంపిల్స్‌లో ఎలాంటి హానికర అవశేషాలు లేవని చెప్పారు. బుధవారం ఉదయం కూడా జలమండలి క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది మంచినీరు సరఫరా చేసిన సమయంలో శాంపిల్స్ సేకరించారని, వాటిలో కూడా ఎలాంటి అనారోగ్య కారకాలు లేవని తేలిందని వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు పేర్కొన్నారు.