TS News: నంబర్ వన్‌గా నిలవడం పారదర్శక పాలనకు నిదర్శనం: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-09-24T03:32:56+05:30 IST

Hyderabad: "స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణ్"లో మరోసారి దేశంలోనే నంబర్ వన్‌గా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు (CM KCR) అన్నారు. సమిష్టి కృషితో పల్లె ప్రగతిని సాధిస్తూ, బం

TS News: నంబర్ వన్‌గా నిలవడం పారదర్శక పాలనకు నిదర్శనం: సీఎం కేసీఆర్

Hyderabad: "స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణ్"లో మరోసారి దేశంలోనే నంబర్ వన్‌గా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు (CM KCR) అన్నారు. సమిష్టి కృషితో పల్లె ప్రగతిని సాధిస్తూ, బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం పునరుద్ఘాటించారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్‌ కింద పలు విభాగాల్లో తెలంగాణ(Telangana) రాష్ట్రం 13 అవార్డులు దక్కించుకుని, దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు దోహదం చేసిన  'పల్లె ప్రగతి' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని, శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని,  సర్పంచులను, ఎంపీటీసీలను, గ్రామ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.  

Updated Date - 2022-09-24T03:32:56+05:30 IST

Read more