టీఆర్ఎస్ ధర్నాలకు రైతులు దూరం

ABN , First Publish Date - 2022-04-07T17:09:40+05:30 IST

హైదరాబాద్: గొప్పలకు పోయి తిప్పలు పడినట్టుంది టీఆర్ఎస్ పరిస్థితి.

టీఆర్ఎస్ ధర్నాలకు రైతులు దూరం

హైదరాబాద్: గొప్పలకు పోయి తిప్పలు పడినట్టుంది టీఆర్ఎస్ పరిస్థితి. కేంద్రం కొనకపోతే చివరి గింజ వరకు తామే కొంటామని చెప్పి.. తర్వాత వరి వేస్తే ఉరి అంటూ సీఎం కేసీఆర్ మాట మార్చడంతో ఇప్పుడు రైతాంగం దగ్గర దోషిగా నిలబడింది గులాబీ నేతలే. రైతుల కోసం టీఆర్ఎస్ నేతలు పోరాడుతున్నా.. వారి నుంచి మద్దతు రాకపోవడంపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.


రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రెండు రోజులుగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రధాన జాతీయ రహదారులపై గులాబీ దళాలు ధర్నాలు నిర్వహించాయి. కేంద్రం తెలంగాణపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రులు ఆరోపణలు గుప్పించారు. కేంద్రం దిగివచ్చేంతవరకు తమ నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ ఆందోళనల్లో రైతులు కనబడకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2022-04-07T17:09:40+05:30 IST