ట్రాఫిక్‌ వలంటీర్లకు సన్మానం

ABN , First Publish Date - 2022-12-15T00:55:36+05:30 IST

ట్రాఫిక్‌ పోలీసులకు సహకరిస్తూ వారి విధి నిర్వహణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఉత్తమ ట్రాఫిక్‌ వలంటీర్లను బుధవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సన్మానించారు.

ట్రాఫిక్‌ వలంటీర్లకు సన్మానం
వలంటీర్లను సన్మానిస్తున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 14(ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ పోలీసులకు సహకరిస్తూ వారి విధి నిర్వహణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఉత్తమ ట్రాఫిక్‌ వలంటీర్లను బుధవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సన్మానించారు. ఎస్‌సీఎస్‌సీ (సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌), సైబరాబాద్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి నవంబర్‌ 30 వరకు రోడ్లపై ట్రాఫిక్‌ వలంటీర్లుగా ఉత్తమ సేవలందించిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎస్‌సీఎ్‌ససీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల మాట్లాడుతూ... ఐదు విభాగాల్లో ఉత్తమ సేవలందించిన ఐదుగురు వలంటీర్లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. రెగ్యులర్‌గా పనివేళల్లో ట్రాఫిక్‌ సిబ్బందికి సహకరించే వలంటీర్లలో ఒకరిని, డ్రంకెన్‌ డ్రైవ్‌లలో సహకరించే వారిలో ఒకరిని, తమ కెమెరాలతో ఉల్లంఘనులను గుర్తించి ట్రాఫిక్‌ పోలీసులకు పోస్ట్‌ చేసే వారిలో ఉత్తమమైన ఒకరిని, ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు, ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించే వారిలో ఒకరిని, రద్దీ సమయాల్లో ఐటీ పార్కుల నుంచి కూడా కొంతమంది సెక్యూరిటీ గార్డులు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌ విధులు నిర్వహించే వారిలో ఒకరిని ఎంపిక చేసి సన్మానించారు. ట్రాఫిక్‌ వలంటీర్లు అందిస్తున్న సేవలను డీసీపీ టి.శ్రీనివా్‌సరావు అభినందిస్తూ... అన్ని రంగాల నుంచి, గృహిణులు, విద్యార్థులు, ఉద్యోగులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్‌ ఫోరం లీడర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ... వలంటీర్ల సాయంతో 8200 ట్రాఫిక్‌ నిబంధనలను గుర్తించడం, వాటిలో 6100 చలానాలు పంపించడం, 5500 గంటల ట్రాఫిక్‌ వలంటీరింగ్‌ జరిగిందని వివరించారు. ట్రాఫిక్‌ వలంటీర్‌గా చేరాలనుకునే వారు 9177283831 నెంబర్‌కు కాల్‌ చేయాలని కోరారు.

Updated Date - 2022-12-15T00:55:43+05:30 IST