చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ బదిలీ

ABN , First Publish Date - 2022-11-02T06:16:50+05:30 IST

ములాఖత్‌ కోసం వచ్చే ఖైదీల కుటుంబ సభ్యులతో అభ్యంతరకరంగా వ్యవహరించిన చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ చింతల దశరథంపై బదిలీ వేటు పడింది.

చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ బదిలీ

కుషాయిగూడ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ములాఖత్‌ కోసం వచ్చే ఖైదీల కుటుంబ సభ్యులతో అభ్యంతరకరంగా వ్యవహరించిన చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ చింతల దశరథంపై బదిలీ వేటు పడింది. ఆయన్ను ఖైదీల వ్యవసాయ క్షేత్రానికి (ఓపెన్‌ ఎయిర్‌ జైలు) బదిలీ చేస్తూ జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జితేందర్‌ ఉత్తర్వులు జారీచేశారు. గతంలోనూ... డిప్యూటీ సూపరింటెండెంట్‌ తన భార్యను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ ఖైదీ ఫిర్యాదు చేయగా, ఆ కేసు మల్కాజిగిరి కోర్టులో ఉంది. కాగా.. ఫర్నీచర్‌ తదితర జైలు ఉత్పత్తుల అమ్మకాలలో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ముడుపులు దండుకుంటున్నారని, దీన్ని అడ్డుకుంటున్న తనపై లేనిపోని అభాండాలు ప్రచారం చేస్తున్నారని దశరథం ఆరోపించారు

Updated Date - 2022-11-02T06:16:50+05:30 IST
Read more