రైళ్లు పాక్షికంగా రద్దు.. దారి మళ్లింపు

ABN , First Publish Date - 2022-11-06T00:48:37+05:30 IST

కాజిపేట-కొండపల్లి సెక్షన్‌లో చెరువుమాధవరం స్టేషన్‌ వద్ద నాన్‌-ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసి, మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

రైళ్లు పాక్షికంగా రద్దు.. దారి మళ్లింపు

హైదరాబాద్‌, నవంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): కాజిపేట-కొండపల్లి సెక్షన్‌లో చెరువుమాధవరం స్టేషన్‌ వద్ద నాన్‌-ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసి, మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నవంబర్‌ 9 నుంచి 17 వరకు విజయవాడ- భద్రాచలం మధ్య తిరిగే రైళ్లను విజయవాడ-ఖమ్మం మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపారు. డోర్నకల్‌-విజయవాడ మధ్యన నడిచే రైళ్ల ను ఖమ్మం-విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు, గుంటూరు- సికింద్రాబాద్‌ మధ్య నడిచే రైళ్లను గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపారు.

దారి మళ్లించనున్న రైళ్లు

విశాఖపట్నం-ఎల్‌టీటీ ముంబాయి రైలు, షాలిమార్‌-సికింద్రాబాద్‌ రైళ్లను నవంబర్‌ 8, 9, 12, 14, 15, 16 తేదీల్లో విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్‌ మీదుగా మళ్లించనున్నట్టు అధికారులు తెలిపారు.

ప్రత్యేక రైళ్లు

నవంబర్‌ 6న కాకినాడ టౌన్‌ నుంచి తిరుపతి వరకు ప్రత్యేక రైలు (07571), నవంబర్‌ 7న తిరుపతి-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07572)ను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-11-06T00:48:39+05:30 IST