నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-08-21T06:06:50+05:30 IST

స్వాతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా ఎల్‌బీ స్టేడియంలో నిర్వహిస్తు

నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

ఎల్‌బీ స్టేడియంకు సీఎం..

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా ఎల్‌బీ స్టేడియంలో నిర్వహిస్తు న్న కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని జాయింట్‌ సీపీ ట్రాఫిక్‌ రంగనాథ్‌ తెలిపారు. సందర్భాన్ని బట్టి వాహనాల రాకపోకలను నిలిపి వేయడం లేదా దారిమళ్లించడం జరుగుతుందన్నారు. 

- చాపెల్‌రోడ్‌, నాంపల్లి వైపునుంచి వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి పీసీఆర్‌ వైపు పంపుతారు.

- బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ, గన్‌ఫౌండ్రీ వైపు పంపుతారు.

- రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్‌ రోడ్‌ వైపునుంచి వచ్చేవాహనాలను నాంపల్లి వైపునకు.

- నారాయణగూడ నుంచి వచ్చే వాహనాలను ఎమ్మెల్యే క్వార్టర్స్‌, హిమాయత్‌నగర్‌ వైపు.

- కింగ్‌ కోఠి, బొగ్గుల కుంట వైపునుంచి వచ్చేవాహనాలను తాజ్‌మహల్‌, ఈడెన్‌ గార్డెన్‌ వైపు పంపుతారు.

- సికింద్రాబాద్‌ నుంచి కోఠికి వచ్చే ఆర్టీసీ బస్సులను లిబర్టీ, నారాయణగూడ, కాచిగూడ వైపుకి

- మెహిదీపట్నం, కూకట్‌పల్లి వైపునుంచి కోఠి వచ్చే ఆర్టీసీ బస్సులను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి నాంపల్లి వైపు పంపుతారు.

- కరీంనగర్‌, అదిలాబాద్‌, సిద్దిపేట, మెదక్‌, నిజామాబాద్‌, మేడ్చల్‌, వరంగల్‌, యాదాద్రి, మంచిర్యాల నుంచి వాహనాల ద్వారా వచ్చే వారు నిజాం కాలేజ్‌ మీదుగా ఎఫ్‌గేట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది

- మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి వైపునుంచి కార్యక్రమానికి హాజరయ్యే వారు ఎల్‌బీస్టేడియం జీ గేట్‌కు చేరాల్సి ఉంటుంది.

- మీడియా వాహనాలతోపాటు సందరకుల వాహనాలను నిలిపేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌, ఏవీకాలేజ్‌, నెక్లెస్‌ రోడ్‌లో పార్కింగ్‌ కోసం కేటాయించారు.

వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని కోరారు.


Updated Date - 2022-08-21T06:06:50+05:30 IST