28 నుంచి మాదిగల సంగ్రామయాత్ర

ABN , First Publish Date - 2022-05-28T09:00:07+05:30 IST

అడ్డగుట్ట, మే 27 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

28 నుంచి మాదిగల సంగ్రామయాత్ర

అడ్డగుట్ట, మే 27 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో  కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. సికింద్రాబాద్‌ పార్శిగుట్టలోని జాతీయ కార్యాలయంలో  శుక్రవారం ఎమ్మార్పీఎస్‌ సంగ్రామయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడ్చల్‌లో ఈనెల 28  సాయంత్రం 4 గంటలకు మాదిగల సంగ్రామయాత్ర మొదలవుతుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై గ్రామాల్లో చైతన్యం కల్పించేందుకే ఈ యాత్రని పేర్కొన్నారు. 120 రోజులపాటు 119 నియోజకవర్గాల్లో  ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. వర్గీకరణ విషయంలో జాప్యంచేస్తే కేంద్రంపై యుద్ధం మొదలవుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ 1 నుంచి సంగ్రామయాత్ర నిర్వహిస్తామని చెప్పారు.  కోనసీమ అంబేడ్కర్‌ జిల్లా పేరును స్వాగతిస్తున్నా మన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో, ఏపీలో ఎమ్మార్పీఎస్‌ పోటీ చేస్తుందని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ సురేష్‌, ఎంఎ్‌సఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T09:00:07+05:30 IST