రేపు ఆంధ్రమహాభారత సహస్రాబ్ది ఉత్సవం
ABN , First Publish Date - 2022-08-12T06:18:22+05:30 IST
ఆదికవి నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి ‘శ్రీమదాంధ్ర మహాభారతం’గా

పాల్గొననున్న గవర్నర్లు, మంత్రులు
పంజాగుట్ట, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఆదికవి నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి ‘శ్రీమదాంధ్ర మహాభారతం’గా అనుసృజన చేసి ఈనెల 22వ తేదీకి వెయ్యి ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నట్టు రాసి కేర్స్ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. అందులో భాగంగా శనివా రం నాంపల్లిలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరం వేదికగా సహస్రాబ్ది మహోత్సవాన్ని జరపనున్నట్లు సంస్థ నిర్వాహకురాలు సుహాసినీ ఆనంద్ గురువారం తెలిపారు. రోజంతా కవిసమ్మేళనాలు, సాహితీ ప్రసంగాలు, కవీంద్ర ఏకపాత్రాభినయం, ఆంధ్రమహాభారత అవతరణ సాహి త్య రూపకం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ వేడుకలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాహితీవేత్త గరికపాటి నరసింహారావు, భారతీయం సత్యవాణి, ఉడిపి పెజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థాచార్య తదితరులు పాల్గొననున్నారని వివరించారు. భారతంలోని 18 పర్వాలను ఒక్కొక్క మహిళ తలపై బోనంలా పెట్టుకొని ఊరేగింపు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఇప్పటికే విశాఖ, రాజరాజమహేంద్రవరంలో ఇలాంటి కార్యక్రమాలు జరిపినట్టు తెలిపారు.