నేటి గోదావరి బోర్డు సమావేశం వాయిదా

ABN , First Publish Date - 2022-12-15T03:38:06+05:30 IST

ఈనెల 15వ తేదీ గురువారం రోజున నిర్వహించాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సమావేశాన్ని ఏపీ విజ్ఙప్తితో జనవరి 3వ తేదీ(మంగళవారం) ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

నేటి గోదావరి బోర్డు సమావేశం వాయిదా

ఈనెల 15వ తేదీ గురువారం రోజున నిర్వహించాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సమావేశాన్ని ఏపీ విజ్ఙప్తితో జనవరి 3వ తేదీ(మంగళవారం) ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. ఈ మేరకు బోర్డు అధికారులు తెలుగు రాష్ట్రాలకు సమాచారం పంపించారు. మాండూస్‌ తుపాను నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ కోరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2022-12-15T03:38:07+05:30 IST