‘దేశ శ్రేయస్సుకు పాటుపడాలి’

ABN , First Publish Date - 2022-08-16T06:35:20+05:30 IST

దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగిం చి సేవలందిస్తున్న సైనికులను మననం చేసుకుంటూ

‘దేశ శ్రేయస్సుకు పాటుపడాలి’
విద్యార్థులకు బ్యాడ్జీలు పెడుతున్న శివకుమార్‌

హిమాయత్‌నగర్‌, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగిం చి సేవలందిస్తున్న సైనికులను మననం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ భాద్యతతో దేశ శ్రేయస్సు కోసం పాటుపడాలని శ్రీనగర్‌, పఠాన్‌కోట్‌ సెక్టార్‌ ఆర్మీ మాజీ మేజర్‌ శివకుమార్‌ విద్యార్థులకు సూచించారు. హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఆయన పాల్గొన్నారు. క్రమశిక్షణ, దేశభక్తి, సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలని ఆయన సూచించారు. పాఠశాల డైరెక్టర్‌ మణికొండ ప్రార్ధన, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-16T06:35:20+05:30 IST