Hal Chal.. పటాన్‌చెరు బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తుల హల్ చల్

ABN , First Publish Date - 2022-08-24T18:25:22+05:30 IST

పటాన్‌చెరు బస్టాండ్‌లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హల్ చల్ చేశారు.

Hal Chal.. పటాన్‌చెరు బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తుల హల్ చల్

సంగారెడ్డి జిల్లా (Sangareddy dist.): పటాన్‌చెరు (Patancheru) బస్టాండ్‌ (Bus Stand)లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హల్ చల్ (Hal Chal) చేశారు. బస్టాండ్‌లో ఉన్న ముషిరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC Bus) సీట్లను దుండగులు తగులబెట్టారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి తెగబడినట్లు సమాచారం. ఆ సమయంలో గస్తీలో ఉన్న పోలీసులు జరిగిన దారుణాన్ని గుర్తించి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more