ఊరెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
ABN , First Publish Date - 2022-10-07T17:02:47+05:30 IST
ఊరెళ్లొచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగుల గొట్టి అందినకాడికి దోచుకెళ్లిన సంఘటన ఏఎ్‌సరావునగర్‌లో చోటుచేసుకుంది. ఏఎ్‌సరావునగర్ ఎల్ఐజీ-బి547లో
నగలు, నగదు అపహరణ
హైదరాబాద్/ఏఎస్‌రావునగర్: ఊరెళ్లొచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగుల గొట్టి అందినకాడికి దోచుకెళ్లిన సంఘటన ఏఎ్‌సరావునగర్‌లో చోటుచేసుకుంది. ఏఎ్‌సరావునగర్ ఎల్ఐజీ-బి547లో నివసిస్తున్న ఈసీఐఎల్ రిటైర్డ్ ఉద్యోగి రాధాకృష్ణ పిళ్లై కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 1న ఇంటికి తాళం వేసి బెంగళూరు వెళ్లాడు. 5వ తేదీ సాయంత్రం తిరిగి రాగా ఇంటి తాళాలు పగులగొట్టి తలుపులు తెరచి ఉన్నాయి. కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా బెడ్రూంలో బీరువా తెరిచి బెడ్‌పై వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో భద్రపరిచిన 15 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, రూ. 15 వేలు కనిపించలేదు. బాధితులు కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ఏసీపీ సాధనా రష్మీ పెరుమాల్, కుషాయిగూడ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, గురువారెడ్డి, క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలు సందర్శించి చోరీ జరిగిన తీరును పరిశీలించాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.