తప్పును సరిదిద్దుకున్న ఎన్నికల సంఘం

ABN , First Publish Date - 2022-12-10T03:02:59+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్ )గా మార్చేందుకు అంగీకరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం...

తప్పును సరిదిద్దుకున్న ఎన్నికల సంఘం

టీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్నట్లుగా సవరణ

న్యూఢిల్లీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్ )గా మార్చేందుకు అంగీకరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన లేఖలో దొర్లిన ఒక తప్పును సరిదిద్దుకుంది. గురువారం జారీ చేసిన లేఖలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం చిరునామా ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో ఉన్నట్లు పేర్కొంది. దీన్ని టీఆర్‌ఎ్‌సవర్గాలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడం, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో శుక్రవారం కమిషన్‌ ఆ లేఖలో చేసిన తప్పును సరిదిద్దుకుంది. శుక్రవారం జారీ చేసిన లేఖలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్నట్లు సవరించుకుంది.

Updated Date - 2022-12-10T03:03:00+05:30 IST