ఎమోషన్‌ను బలహీనతగా భావించొద్దు..

ABN , First Publish Date - 2022-06-19T14:52:32+05:30 IST

మహిళలు ఎమోషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనతగా భావించవద్దని టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ అన్నారు. ఆడవారు అంటే ఆది శక్తి అ

ఎమోషన్‌ను బలహీనతగా భావించొద్దు..

నైనా జైస్వాల్‌ 

హైదరాబాద్/రాయదుర్గం: మహిళలు ఎమోషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనతగా భావించవద్దని టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ అన్నారు. ఆడవారు అంటే ఆది శక్తి అన్నారు. ‘ఆడవారిని అగ్నితో పోల్చకు ఆరిపోతుంది. పువ్వుతో పోల్చకు రాలి పోతుంది. మంచుతో పోల్చకు కరిగిపోతుంది. ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు అద్బుతంగా ఉండిపోతుంది’ అని అన్నారు. శనివారం నానక్‌రామ్‌గూడ ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ గౌలిదొడ్డిలోని భారత్‌ హ్యుందాయ్‌ షోరూమ్‌లో వెన్యూ కొత్త మోడల్‌ కారును ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో భారత్‌ గ్రూప్‌ ఎండీ శ్రీకాంత్‌ కేస, సీజీఎం ఎస్‌.సెసిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-19T14:52:32+05:30 IST