జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ కసరత్తు ముమ్మరం

ABN , First Publish Date - 2022-06-24T00:23:00+05:30 IST

జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ కసరత్తు ముమ్మరం చేశారు. ఏర్పాట్లపై అధిష్టానానికి తెలంగాణ బీజేపీ నేతలు నివేదిక ఇచ్చారు. ఈనెల 30న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ రానున్నారు.

జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ కసరత్తు ముమ్మరం

హైదరాబాద్: జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ కసరత్తు ముమ్మరం చేశారు. ఏర్పాట్లపై అధిష్టానానికి తెలంగాణ బీజేపీ నేతలు నివేదిక ఇచ్చారు. ఈనెల 30న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ రానున్నారు.  రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. అలాగే జులై 1న హెచ్ఐసీసీలో పార్టీ కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. జులై 2,3న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వివిధ తీర్మానాలకు ఆమోదం తెలపనున్నారు. అలాగే జులై 3న పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. 

Updated Date - 2022-06-24T00:23:00+05:30 IST