వైద్య విద్యలో అగ్రగామిగా తెలంగాణ
ABN , First Publish Date - 2022-12-31T00:41:51+05:30 IST
వైద్య విద్యలో అగ్రగామిగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి అన్నారు.
రామంతాపూర్, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో అగ్రగామిగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి రామంతాపూర్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల 55వ వార్షికోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆలోచన ధోరణితో రాష్ట్రంలో వైద్య విద్యా సీట్లు పెరగడం జరిగిందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశాలు పెరగడం ఆనందదాయకమని అన్నారు. ఆయుష్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, హోమియో వైద్య విద్యార్థులు పేద రోగులకు తమ సేవలను అందించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కేంద్ర హోమియో పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ సుభాష్ కౌషిక్, సభ్యులు డాక్టర్ దత్త నాయక్, అనుప్రియ చౌదరి, పి.హిమబిందు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.లింగరాజు, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివా్‌సరెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డం రవికుమార్, గరికె సుధాకర్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు సెల్‌ఫోన్ మోజు వీడాలి
రామంతాపూర్, డిసెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సెల్‌ఫోన్ మోజు వీడాలని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి అన్నారు. హబ్సిగూడ వెంకట్‌రెడ్డినగర్ సాయిరామ్ కాన్వెంట్ పాఠశాలలో శుక్రవారం ఉత్తమ విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలని, తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం పాఠశాల నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బుచ్చిరెడ్డి, ప్రిన్సిపాల్ మానస, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ బి.వి.చారి, నాయకులు గరికె సుధాకర్, అక్తర్, సూరం శంకర్, జేసీబీ రాజు, అద్వైత్‌రెడ్డి, యాదమ్మ, ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆస్తుల పరిరక్షణకు చర్యలు
ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నాగోల్ వరకు నిర్మించనున్న ఫ్లై ఓవర్ కారణంగా తమ ఆస్తులకు ఎలాంటి నష్టం కలుగకుండా పరిరక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ యజమానులు శుక్రవారం ఎమ్మెల్యే సుభా్‌షరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో భవన యజమానులు మేకల మధుసూధన్‌రెడ్డి, ఆదిత్యారెడ్డి, కిషోర్, రామకృష్ణారెడ్డి, పరమేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.