TS Highcourt: మునుగోడు ఉపఎన్నికల్లో గుర్తులపై హైకోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2022-10-17T17:25:56+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో (Munugodu by poll) గుర్తులపై హైకోర్టు (High court)లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సోమవారం ఉదయం అధికారపార్టీ టీఆర్ఎస్ (TRS) ఈ పిటిషన్ను దాఖలు చేసింది. కాగా... లంచ్ మోషన్ పిటిషన్ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అత్యవసర విచారణ చేపట్టలేమని తేల్చిచెప్పింది. నవంబర్ 3న ఎన్నికలు ఉన్నందున ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీఆర్ఎస్ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ పిటిషన్పై రేపు విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ (Chief Justice Ujjal Bhuyan) అన్నారు.