Governor Tamilisi: నాకు గౌరవం ఇవ్వకపోతే ఎవ్వరినీ లెక్క చేయను

ABN , First Publish Date - 2022-09-08T18:41:28+05:30 IST

తెలంగాణ ప్రజలకు మంచి చేసే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చిందని గవర్నర్ తమిళిసై అన్నారు.

Governor Tamilisi: నాకు గౌరవం ఇవ్వకపోతే ఎవ్వరినీ లెక్క చేయను

హైదరాబాద్: తెలంగాణ (Telangana) ప్రజలకు మంచి చేసే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చిందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilisai Soundararajan ) అన్నారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నేటితో మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ (Telangana governor) మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు గౌరవం ఇవ్వకపోతే ఎవ్వరినీ లెక్క చేయను. నేను ఎవరికీ తక్కువ కాదన్న ఆలోచనలో భాగంగా మంచి చేసేందుకు ముందుకు వెళ్తాను’’ అని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజ్ భవన్ మొదటి సారి ప్రజా భవన్ అయిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అనేక ట్రైబల్ ఏరియాలను విజిట్ చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసినట్లు చెప్పారు. పౌష్ఠికాహారం లోపంతో బాధపడుతున్న పిల్లల పట్ల బాధ్యతగా పని చేశామన్నారు. యునివర్సిటీలను సందర్శించి విద్యార్థుల ఇబ్బందులపై సీఎం (CM KCR)కు లేఖ రాశామని చెప్పారు. వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను సందర్శించి ప్రభుత్వానికి వివరాలు అందించినట్లు గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. 


సర్కార్‌పై తమిళిసై ఆగ్రహం

రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవహార తీరుపైనా తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఫల్యాలను ఏకరుపెట్టారు. ప్రభుత్వం అనేమార్లు తనను ఇబ్బందులకు గురిచేసినట్లు చెప్పారు. గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్ పాటించట్లేదని మండిపడ్డారు. అలాగే రెండు రోజుల నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ గుండెపోటుకు గురవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అంశాన్ని కూడా గవర్నర్ ప్రస్తావించారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రి డైరెక్టర్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారంటే.. ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఏంటనేది అర్థమవుతోందని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేశారు. 

Read more