కేబినెట్‌ నిర్ణయంపై తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం

ABN , First Publish Date - 2022-01-19T15:43:55+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మూడు డీఏలు ఇవ్వడానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించిన సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

కేబినెట్‌ నిర్ణయంపై తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మూడు డీఏలు ఇవ్వడానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించిన సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మార్త రమేష్‌ మీడియా ముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజన సమయంలో తలెత్తిన కొన్ని పొరపాట్లను సవరించడంతో పాటు నష్టపోయిన ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే విధంగానూ చర్యలు చేపట్టాలని ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరుతున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మార్త రమేష్‌, ప్రధాన కార్యదర్శి ఆకుల నందకుమార్‌,  నాయకులు చందర్‌, దేవేందర్‌, వెంకటరావు, రమణరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T15:43:55+05:30 IST