మాతాశిశు సంరక్షణలో తెలంగాణ భేష్‌

ABN , First Publish Date - 2022-12-15T03:48:02+05:30 IST

మాతాశిశు సంరక్షణలో రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది....

మాతాశిశు సంరక్షణలో తెలంగాణ భేష్‌

రాష్ట్రానికి రెండు అవార్డులు.. మంత్రి హరీశ్‌ హర్షం

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మాతాశిశు సంరక్షణలో రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఉత్తమమైనవంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రశంసించింది. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ మాతృత్వ ఆరోగ్య వర్క్‌షాప్‌ కార్యక్రమంలో రాష్ట్రానికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రెండు అవార్డులను ప్రకటించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ చేతులమీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాయింట్‌ డైరెక్టర్‌ (మెటర్నల్‌ హెల్త్‌) డాక్టర్‌ పద్మజ ఆ అవార్డులను బుధవారం అందుకున్నారు. అవార్డులు లభించడంపై మంత్రి హరీశ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-15T03:48:03+05:30 IST