సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి

ABN , First Publish Date - 2022-12-07T03:40:40+05:30 IST

హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం ఉదయం 6.20కు 84 మందితో నాసిక్‌ బయల్దేరిన స్పైస్‌జెట్‌ విమానంలో కొద్దిసేపట్లోనే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా దింపేశారు.

సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానం వెనక్కి

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం ఉదయం 6.20కు 84 మందితో నాసిక్‌ బయల్దేరిన స్పైస్‌జెట్‌ విమానంలో కొద్దిసేపట్లోనే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా దింపేశారు. గాల్లోకి ఎగిరిన 30 నిమిషాల తర్వాత సాంకేతిక లోపాన్ని పైలెట్లు గుర్తించారు. ప్రయాణికులు 4 గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఎయిర్‌లైన్స్‌ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వారంతా అందోళనకు దిగారు.. మధ్యాహ్నం తర్వాత మరో విమానంలో ప్రయాణికులను తరలించినట్లు సమాచారం.

Updated Date - 2022-12-07T03:40:41+05:30 IST