Hyderabad City: వెయ్యి మంది విద్యార్థులతో నిమిషానికో టేబుల్‌

ABN , First Publish Date - 2022-12-31T11:24:00+05:30 IST

వెయ్యి మంది విద్యార్థులతో నిమిషానికో టేబుల్‌(ఎక్కాలు) చొప్పున వంద నిమిష్లాల్లో 100 టేబుల్స్‌

Hyderabad City: వెయ్యి మంది విద్యార్థులతో నిమిషానికో టేబుల్‌

వంద నిమిషాల్లో 100 టేబుల్స్‌

5న వెయ్యి మంది విద్యార్థులతో అప్పజెప్పే కార్యక్రమం

హైదరాబాద్‌ సిటీ: వెయ్యి మంది విద్యార్థులతో నిమిషానికో టేబుల్‌(ఎక్కాలు) చొప్పున వంద నిమిష్లాల్లో 100 టేబుల్స్‌ అప్పజెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనవరి 5న వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌-లండన్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీచైతన్య స్కూల్‌ అకాడమిక్‌ డైరెక్టర్‌ సీమ వెల్లడించారు. పది రాష్ట్రాల నుంచి శ్రీచైతన్య స్కూల్‌కు చెందిన రెండున్నరేళ్ల నుంచి ఏడేళ్లలోపు విద్యార్థులకు వంద రోజుల పాటు టేబుల్స్‌పై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 100 టేబుల్స్‌ అనర్గళంగా చెప్పే సామర్థ్యం ఉన్న కొందరు చిన్నారులను పరిచయం చేశారు. స్కూల్‌, కాలేజీ స్థాయిలో కాకుండా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలోనే చిన్నారుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు మెథడాలజీ కరికులమ్‌ రూపొందించామని డైరెక్టర్‌ సీమ తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఫొటోగ్రఫీ మెమోరీ ఆధారంగా క్లాస్‌ రూమ్‌లో ప్రవేశపెట్టామని చెప్పారు. 2014లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించగా మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు.

Updated Date - 2022-12-31T11:34:27+05:30 IST