ట్రాఫిక్‌ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన

ABN , First Publish Date - 2022-12-07T00:48:13+05:30 IST

ట్రాఫిక్‌ నిబంధనలు ప్రతి ఒక్క రూ పాటించాలని బేగంపేట్‌ ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇని స్టిట్యూట్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు సూచించారు.

 ట్రాఫిక్‌ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన

తార్నాక, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ నిబంధనలు ప్రతి ఒక్క రూ పాటించాలని బేగంపేట్‌ ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇని స్టిట్యూట్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు సూచించారు. మంగళవారం బేగంపేట్‌ ట్రాఫిక్‌ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఓయూలోని ఆంధ్ర మహిళా సభ (ఏఎంఎస్‌) స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మెటిక్స్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, స్టాఫ్‌లైన్‌, ఫ్రీలెఫ్ట్‌, ఆపరేషన్‌ రోప్‌ వంటి నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించి 2019 మోటారు వెహికిల్‌ చట్టంలో వచ్చిన మార్పులను వివరించారు. ట్రాఫిక్‌ సీఐ మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుని నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు. కార్యక్రమంలో బేగంపేట్‌ ట్రాఫిక్‌ సిబ్బంది కృష్ణ, చక్రదర్‌, నల్లకుంట పీఎస్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఆంథోనమ్మ, ఏఎంఎస్‌ స్కూల్‌ డైరెక్టర్‌ కె. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:48:17+05:30 IST