యశోద సినిమా ఓటీటీ విడుదలపై స్టే

ABN , First Publish Date - 2022-11-24T03:18:52+05:30 IST

ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ఓటీటీ విడుదలపై స్టే విధిస్తూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

యశోద సినిమా ఓటీటీ విడుదలపై స్టే

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ఓటీటీ విడుదలపై స్టే విధిస్తూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమ హాస్పిటల్‌ విశ్వసనీయతకు భంగం కలిగేలా యశోద సినిమాను చిత్రీకరించారని పేర్కొంటూ ఇవా ఐవీఎఫ్‌ ప్రైవేటు హాస్పిటల్‌ యాజమాన్యం పిటిషన్‌ దాఖలు చేసింది. సినిమాలో తమ హాస్పిటల్‌ పేరును చూపించారని.. దీనివల్ల తమ ప్రతిష్ఠకు భంగం కలిగిందని హాస్పిటల్‌ యాజమాన్యం పేర్కొంది. వాదనలు నమోదు చేసుకున్న కోర్టు.. డిసెంబర్‌ 19 వరకు సినిమాను ఓటీటీలో విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సినిమా నిర్మాతలకు నోటీసులు జారీచేసింది.

Updated Date - 2022-11-24T03:18:52+05:30 IST

Read more