‘బోగస్‌’ను కనుక్కోవడం ఈజీ

ABN , First Publish Date - 2022-11-19T03:18:47+05:30 IST

నకిలీ సర్టిఫికెట్ల ముప్పును అరికట్టేందుకు దేశంలోనే తొలిసారిగా స్టూడెంట్‌ అకడమిక్‌ వెరిఫికేషన్‌ సర్వీస్‌ (ఎస్‌ఏవీఎస్‌) పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

‘బోగస్‌’ను కనుక్కోవడం ఈజీ

అందుబాటులోకి సర్టిఫికెట్ల ఉచిత వెరిఫికేషన్‌ సేవలు

ప్రస్తుతానికి డిగ్రీ, పీజీ త్వరలో ఇంటర్‌, టెన్త్‌ కూడా..

1,500 చెల్లిస్తే ఈమెయిల్‌కు సాఫ్ట్‌ కాపీ

ప్రారంభించిన విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నకిలీ సర్టిఫికెట్ల ముప్పును అరికట్టేందుకు దేశంలోనే తొలిసారిగా స్టూడెంట్‌ అకడమిక్‌ వెరిఫికేషన్‌ సర్వీస్‌ (ఎస్‌ఏవీఎస్‌) పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సర్టిఫికెట్లను సులభంగా, అత్యంత వేగంగా ఈ పోర్టల్‌ ద్వారా వెరిఫికేషన్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మాసాబ్‌ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి మంత్రి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ... ప్రస్తుతానికి డిగ్రీ, పీజీ విద్యార్థుల సర్టిఫికెట్లను ఈ పోర్టల్లో వెరిఫికేషన్‌ చేసుకోవచ్చని, త్వరలోనే ఇంటర్‌, పదో తరగతి సర్టిఫికెట్లను కూడా వెరిఫై చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. 2010-2021 మధ్యకాలంలో పట్టభద్రులైన 25 లక్షల మంది విద్యార్థుల డేటాను, సర్టిఫికెట్లను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లను అరికట్టడానికి ఈ పోర్టల్‌ దోహదపడుతుందని మంత్రి చెప్పారు.

డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తు న్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు, పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతు న్న విద్యావిధానం గురించి దేశ విదేశాలకు చెందినవారు తెలుసుకునేందుకు వీలుగా 28 భాషల్లో వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దినట్టు తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీతో పాటు పలు విదే శీ భాషల్లో కూడా సమాచారాన్ని పొందుపరచినట్టు చెప్పారు. మొబైల్‌ ద్వారా కూడా వెబ్‌సైట్‌ను చూసే విధంగా రీడిజైన్‌ చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివా్‌సరావు, పలు వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లు రవీందర్‌, గోపాల్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, తాటికొండ రమేష్‌, రవీందర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

వెరిఫికేషన్‌ ఇలా..

ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.్టటఛిజ్ఛి.్చఛి.జీుఽ ద్వారా ఎస్‌ఏవీఎస్‌ సేవలను పొందవచ్చు. కేవలం నిమిషాల వ్యవధిలోనే సర్టిఫికెట్‌ అసలుదో నకిలీదో తేల్చవచ్చు. నియామక సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, విద్యా సంస్థలు. జాతీయ అంతర్జాతీయ ఏజెన్సీలు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. నకిలీవిగా అనుమానం ఉన్న సర్టిఫికెట్లపై విచారణ జరపొచ్చు. ఇది ప్రభు త్వ, ప్రైవేట్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీలకు బాగా ఉపయోగపడుతుం ది. ఈ సేవలను ఉపయోగించుకోవాలంటే... వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి, స్టూడెంట్‌ వెరిఫికేషన్‌ లింక్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం ఈమెయిల్‌ అడ్ర్‌సను నమోదుచేయడం ద్వారా వెబ్‌సైట్‌లోకి వెళ్లవచ్చు. ఇన్‌స్టంట్‌ వెరిఫికేషన్‌ సర్వీస్‌ కావాలంటే విద్యార్థి హాల్‌ టికెట్‌ నంబర్‌ను ఎం టర్‌ చేయాలి. వెంటనే సంబంధిత విద్యార్థి పేరు, ఫోటో, ఏ సంవత్సరంలో పాసయ్యారు వంటి వివరాలు ప్రత్యక్షమవుతా యి. ఈ ేసవలు ఉచితంగా లభిస్తాయి. అలాగే పూర్తిస్థాయి వెరిఫికేషన్‌ సర్వీ్‌సలో అయితే... విద్యార్థి పేరు, పాసైన సంవత్సరం, ఫోటోతోపాటు ఏ కోర్సు, ఏ గ్రేడ్‌లో పాసయ్యారు వంటి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. అవసరమైతే డిజిటల్‌ సంతకం చేసిన మెమో సాఫ్ట్‌ కాపీని కూ డా ఈమెయిల్‌ ద్వారా పొందవచ్చు. అయితే దీనికి రూ.1500 ఫీజు చెల్లించాలి. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం... సర్టిఫికెట్‌పై అనుమానం వస్తే, సంబంధిత ఏజెన్సీలు వర్సిటీలకు లేఖలు రాసి సమాచారాన్ని తెప్పించుకునేవి. ఎస్‌ఏవీఎస్‌ ద్వారా ఇకపై ఆ అవసరం ఉండదు.

Updated Date - 2022-11-19T03:18:47+05:30 IST

Read more