భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక టీంలు

ABN , First Publish Date - 2022-06-26T16:44:46+05:30 IST

నగరంలో జలమండలి చేపట్టే పనుల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్‌

భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక టీంలు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో జలమండలి చేపట్టే పనుల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్‌ తెలిపారు. జల మండలి ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వ హించిన సమీక్షలో నూతన వ్యవస్థ వివరాలను వెల్లడించారు. సేఫ్టీ ఆడిట్‌లో భాగంగా పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు కొత్తగా 6 సేఫ్టీ ప్రొటోకాల్‌ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు దాన కిషోర్‌ తెలిపారు. పైపులైన్‌ల విస్తరణ, సివరేజ్‌ పనులు, లీకేజీలు అరికట్టడం, మ్యాన్‌హోల్‌ మరమ్మతులు జరిగే ప్రదేశాల్లో ఈ టీంలు ప్రతి పనిని పరిశీలించడంతోపాటు తనిఖీలు చేస్తాయని తెలిపారు. పనులు జరిగే అన్ని ప్రదేశాల్లో ఏజెన్సీ/కాంట్రాక్టర్‌ పేరు, ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ వంటి వివరాలు తెలిపే బోర్డులు, పనిని వివరించే క్యూఆర్‌ కోడ్‌లు జూలై 5లోగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్‌ వీఎల్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆపరేషన్‌ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T16:44:46+05:30 IST