ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక కొవిడ్‌ బ్లాక్‌

ABN , First Publish Date - 2022-01-20T17:06:15+05:30 IST

రోజు రోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక కొవిడ్‌ బ్లాక్‌

లంగర్‌హౌస్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రోజు రోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా బారిన పడుతున్న వారు పరీక్షలు చేయించుకుని పాజిటివ్‌ వస్తే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కొవిడ్‌ బారినపడిన వారు సీరియ్‌సగా ఉంటే ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గాంధీ, కిమ్స్‌ ఆస్పత్రులను కొవిడ్‌ ఆస్పత్రులుగా మార్చారు. వాటితో పాటు పాతనగరంలోని గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేకంగా కొవిడ్‌ బ్లాక్‌ను నిర్మించారు. గత ఏడాది కరోనా సమయంలో ఆస్పత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ సందర్శించి కొవిడ్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 105 పడకలతో కొవిడ్‌ బ్లాక్‌ను సిద్ధం చేశారు. గాంధీ, కిమ్స్‌ ఆస్పత్రుల్లో పేషెంట్లు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో చేర్చుకునేందుకు అన్నీ సిద్ధం చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గోపాల్‌ తెలిపారు.


రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 164 మందికి పాజిటివ్‌ 

రాజేంద్రనగర్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో బుధవారం 587 మందికి కరోనా పరీక్షలు చేయగా 164 మందికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2022-01-20T17:06:15+05:30 IST