క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన ఆరు జట్లు

ABN , First Publish Date - 2022-11-25T00:03:05+05:30 IST

క్రిడలతో ఒత్తిడిని అదిగమించొచ్చని టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌ఎం హుస్సేనీ(ముజీబ్‌) అన్నారు.

క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన ఆరు జట్లు

మంగళ్‌హాట్‌, నవంబర్‌ 24(ఆంధ్రజ్యోతి): క్రిడలతో ఒత్తిడిని అదిగమించొచ్చని టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌ఎం హుస్సేనీ(ముజీబ్‌) అన్నారు. 8వ క్రికెట్‌ చంద్రశేఖర్‌ మెమోరియల్‌ నాకౌట్‌ టోర్నమెంట్‌ పోటీ ల్లో భాగంగా క్వార్టర్‌ ఫైనల్స్‌ డెంటల్‌ కాలేజ్‌ యూనిట్‌, సెంట్రల్‌ లైబ్రరీ యూ నిట్‌, పెన్షన్‌ పేమెంట్‌ యూనిట్‌, వక్ఫ్‌ బోర్డ్‌ యూనిట్‌, హైదరాబాద్‌ యూత్‌ ఫోర్స్‌, ఆర్‌టీఏ యూనిట్లు అర్హత సాధించాయి. ఈ సందర్భంగా ముజీబ్‌ మా ట్లాడుతూ ఉద్యోగుల్లో పని ఒత్తిడి తగ్గించేందుకు ఈ ఆటలు ఎంతో దోహద పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విక్రమ్‌ కుమార్‌, నాయకులు ఉమర్‌ ఖాన్‌, కుర్రాడి శ్రీనివాస్‌, మురళీరాజ్‌, నరేష్‌ కుమార్‌, ఖాలీద్‌ అహ్మద్‌, వైదిక్‌ శాస్త్ర, ముఖిమ్‌ ఖురేషి, శ్రీధర్‌, ఎండీ వహీద్‌, ఆయా యూనిట్ల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:03:05+05:30 IST

Read more