షర్మిల ఘటన వ్యక్తిగతంగా బాధాకరం: సజ్జల

ABN , First Publish Date - 2022-11-30T03:29:28+05:30 IST

హైదరాబాద్‌లో వైఎస్‌ షర్మిల పట్ల జరిగిన ఘటన వ్యక్తిగతంగా బాధ కలిగించే అంశమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

షర్మిల ఘటన వ్యక్తిగతంగా బాధాకరం: సజ్జల

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో వైఎస్‌ షర్మిల పట్ల జరిగిన ఘటన వ్యక్తిగతంగా బాధ కలిగించే అంశమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైసీపీగా వేరే రాష్ట్రంలో ఉన్న తమ పార్టీ.. రాజకీయంగా తెలంగాణలో షర్మిల పార్టీ తీసుకునే నిర్ణయాలపై ఎలా స్పందిస్తామని ప్రశ్నించారు. మహానేత కుమార్తెగా, జగన్మోహన్‌రెడ్డి చెల్లెలుగా షర్మిల గతంలో తమందరిలో ఓ భాగంగా ఉండేదన్నారు. ఈ కారణంగా ఇలా జరగడం వ్యక్తిగతంగా బాధ కలిగించే అంశమైని తెలిపారు. తమది వైసీపీ .. షర్మిలది టీవైసీపీ.. రెండూ వేర్వేరు పార్టీలని పేర్కొన్నారు. ఆ పార్టీ తీసుకునే రాజకీయ పరమైన నిర్ణయాలు, విధాన నిర్ణయాలపై తాము స్పందించడం కరెక్టు కాదని సజ్జల వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-11-30T03:29:28+05:30 IST

Read more