Safe City Projectను మరింత బలోపేతం చేద్దాం!

ABN , First Publish Date - 2022-03-18T15:01:36+05:30 IST

మహిళలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన సేఫ్‌ సిటీ ప్రాజెక్టును మరింత బలోపేతం చేద్దామని

Safe City Projectను మరింత బలోపేతం చేద్దాం!

  • నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌


హైదరాబాద్‌ సిటీ : మహిళలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన సేఫ్‌ సిటీ ప్రాజెక్టును మరింత బలోపేతం చేద్దామని సీవీ ఆనంద్‌ అన్నారు. నగరంలో మహిళా భద్రతపై గురువారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో మూడు కమిషనరేట్ల సీపీలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆయా కమిషనరేట్లకు అవసరమైన ప్రోగ్రామ్‌ మేనేజర్లను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి అదనపు డీజీ (విమెన్‌ సేఫ్టీ వింగ్‌) స్వాతి లక్రా, సీపీలు స్టీఫెన్‌ రవీంద్ర, మహేష్‌ భగవత్‌, అదనపు సీపీ డీఎ్‌స చౌహాన్‌, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ ప్రియాంక, టీఎస్‌టీఎస్‌ జీఎం పుష్ప రాథోడ్‌, జాయింట్‌ సీపీ అడ్మిన్‌ ఎమ్‌.రమేష్‌, అడిషనల్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) ఏ.వి.రంగనాథ్‌,  జాయింట్‌ సీపీ సీసీఎస్‌ గజరావు భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-18T15:01:36+05:30 IST