రోడ్డు ప్రమాదలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ మృతి

ABN , First Publish Date - 2022-06-19T17:33:24+05:30 IST

కరీంగూడ చౌరస్తా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నూజివీడు సీడ్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ మృతిచెందాడు. తూప్రాన్‌-2 ఎస్‌ఐ యాదగిరిరెడ్డి

రోడ్డు ప్రమాదలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ మృతి

హైదరాబాద్/తూప్రాన్‌: కరీంగూడ చౌరస్తా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నూజివీడు సీడ్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ మృతిచెందాడు. తూప్రాన్‌-2 ఎస్‌ఐ యాదగిరిరెడ్డి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని చింతల్‌, బాల్‌రెడ్డినగర్‌లో నివాసముండే కూశెట్టి రవి(48) కొంపెల్లిలోని నూజివీడు సీడ్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై తూప్రాన్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో తూప్రాన్‌ పట్టణ పరిధి హైవే 44 రోడ్డు బైపాస్‌ కరీంగూడ చౌరస్తా వద్ద, హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపునకు వెళుతున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న రవి అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్‌ పారిపోతుండగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. మృతుడి భార్య కూశెట్టి సుకన్య ఫిర్యాదు మేరకు కేసు దార్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-06-19T17:33:24+05:30 IST