కారు బోల్తా.. బీటెక్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-06-11T17:01:03+05:30 IST

లష్కర్‌గూడ, కనకదుర్గానగర్‌ వద్ద శుక్రవారం అధిక వేగంతో వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బీటెక్‌ విద్యార్థి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి

కారు బోల్తా.. బీటెక్‌ విద్యార్థి మృతి

 ఇద్దరికి గాయాలు 

హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్‌: లష్కర్‌గూడ, కనకదుర్గానగర్‌ వద్ద శుక్రవారం అధిక వేగంతో వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బీటెక్‌ విద్యార్థి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సైదాబాద్‌ కాలనీకి చెందిన రావూరి అభిషేక్‌ (20) స్ఫూర్తి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గుంతపల్లిలోని అవంతి ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యేందుకు తోటి విద్యార్థులు గన్నోజి రాఘవేంద్ర, గౌరవ్‌తేజ్‌తో కలిసి కారులో వెళుతున్నాడు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ చౌరస్తా దాటి లష్కర్‌గూడ కనకదుర్గానగర్‌ వద్దకు చేరుకోగానే అధిక వేగం కారణంగా కారు అదుపుతప్పి కొద్ది దూరం పల్టీలు కొడుతూ వెళ్లి బోల్తా పడింది. ముందు సీట్లో కూర్చున్న అభిషేక్‌ కారులో నుంచి బయటపడడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవింగ్‌ చేస్తున్న రాఘవేందర్‌తో పాటు గౌరవ్‌తేజ్‌కు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more