Hyderabad City: 39ఏళ్ల వ్యక్తి మూడేళ్లుగా కడుపు నొప్పి

ABN , First Publish Date - 2022-12-07T12:49:16+05:30 IST

ఓ వ్యక్తి పిత్తాశయం, పిత్తవాహిక నుంచి వెయ్యికి పైగా రాళ్లను మెడికవర్‌ వైద్యులు తొలగించారు. పశ్చిమబెంగాల్‌కు

Hyderabad City: 39ఏళ్ల వ్యక్తి మూడేళ్లుగా కడుపు నొప్పి

హైదరాబాద్‌ సిటీ: ఓ వ్యక్తి పిత్తాశయం, పిత్తవాహిక నుంచి వెయ్యికి పైగా రాళ్లను మెడికవర్‌ వైద్యులు తొలగించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన 39ఏళ్ల వ్యక్తి మూడేళ్లుగా కడుపు నొప్పి, కామెర్లతో బాధపడుతున్నాడు. అతని పిత్తవాహిక, బహుళ పిత్తాశయంలో వివిధ పరిమాణాలలో రాళ్లు ఉన్నట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. చికిత్సలు అందించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఇటీవల హైదరాబాద్‌లోని మెడికవర్‌ ఆస్పత్రి లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌, హెపాటో ప్యాంక్రియాటో బిలియరీ సర్జన్‌ కిషోర్‌రెడ్డిని సంప్రందించారు. ఆయన పరీక్షించి సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పది రోజుల క్రితం పిత్తాశయం, పిత్తవాహిక నుంచి 5ఎంఎం నుంచి 50ఎంఎం వరకు వివిధ ఆకారాలలో ఉన్న రాళ్లను తొలగించారు. ఈ రాళ్లు వెయ్యి కంటే ఎక్కువ ఉంటాయని, వాటి బరువు 250 గ్రాముల వరకు ఉంటుందని తెలిపారు.

Updated Date - 2022-12-07T12:49:22+05:30 IST