రామచంద్ర భారతి జైలు నుంచి విడుదల

ABN , First Publish Date - 2022-12-31T04:56:57+05:30 IST

నకిలీ పాస్‌పోర్టు కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న రామచంద్రభారతి శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు.

రామచంద్ర భారతి జైలు నుంచి విడుదల

సైదాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నకిలీ పాస్‌పోర్టు కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న రామచంద్రభారతి శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. నిజానికి, న్యాయస్థానం ఆయనకు గురువారమే బెయిల్‌ మంజూరు చేసింది. కానీ బెయిల్‌ పత్రాలు జైలుకు ఆలస్యంగా చేరడంతో విడుదలలో జాప్యం జరిగింది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో జైలు నుంచి బయటికొచ్చిన రామచంద్ర భారతి.. తన కోసం వేచి ఉన్న న్యాయవాదితో కలిసి కారులో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

Updated Date - 2022-12-31T04:56:58+05:30 IST

Read more