మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకొవాలి: తలసాని

ABN , First Publish Date - 2022-07-02T22:04:16+05:30 IST

Hyderabad: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన బీజేపీ నాయకులనుద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధానికి నేను స్వాగతం పలికాను. సీఎం స్వాగతం

మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకొవాలి:  తలసాని

Hyderabad: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన బీజేపీ నాయకులనుద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధానికి నేను స్వాగతం పలికాను. సీఎం స్వాగతం పలకాలని అని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకొవాలి. భారత్ బయోటెక్‌కు ప్రధాని వచ్చినప్పుడు ప్రొటొకాల్ అవసరం లేదా? సీఎం అవసరం లేదా? అప్పటి నుంచి గ్యాప్ నడుస్తుంది. గతంలోనే 2వ తేది యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తా అన్నారు. రోజు హైదరాబాద్‌కు ఎంతోమంది పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు..వీళ్లు అంతే. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ర్యాలీలో  మేము చూపించిన చిన్న శాంపిల్ మాత్రమే. ఎవ్వరు ఎవ్వరికి భయపడరు. ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాటయిన మహారాష్ట్ర  ప్రభుత్వాన్ని కూల్చారు. మహారాష్ట్ర పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుంది....బీజేపీ బలం ఇక్కడ ఎంత ? ముందస్థు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.  

Updated Date - 2022-07-02T22:04:16+05:30 IST