Police strategy: రాత్రి వేళ ప్రమాదాల నివారణకు పోలీసుల వ్యూహం

ABN , First Publish Date - 2022-12-07T12:32:30+05:30 IST

రాత్రి వేళ ప్రమాదాల నివారణకు నగర ట్రాఫిక్‌ పోలీసులు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. మెరిసే బారికేడ్లను

Police strategy: రాత్రి వేళ ప్రమాదాల నివారణకు పోలీసుల వ్యూహం

హైదరాబాద్‌ సిటీ: రాత్రి వేళ ప్రమాదాల నివారణకు నగర ట్రాఫిక్‌ పోలీసులు కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. మెరిసే బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఓవర్‌ స్పీడ్‌ (అతివేగం), లైటింగ్‌ సరిగా లేకపోవడం, ఫుట్‌పాత్‌లు, బారికేడ్లు కనిపించక కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదాలకు ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించి ‘స్పీడ్‌ కామింగ్‌’ (మెరిసే బారికేడ్లు) ఏర్పాట్లు ప్రారంభించారు. రాత్రి ప్రమాదాల నివారణ నిమిత్తం చేపట్టిన కార్యక్రమాలతో గతేడాదితో పోలిస్తే ప్రమాదాలు తగ్గాయని ట్రాఫిక్‌ ఇన్‌చార్జి అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం నగరంలోని అన్ని ట్రాఫిక్‌ పీఎ్‌సలకు బారికేడ్లను పంపిణీ చేశారు.

Updated Date - 2022-12-07T12:36:59+05:30 IST