Hyderabad: నవీన్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు
ABN , First Publish Date - 2022-12-15T14:15:32+05:30 IST
దంత వైద్యురాలు వైశాలి (Vaishali) కిడ్నాప్ కేసు (Kidnapping Case)లో కస్టడీ పిటిషన్‌ను ఆదిభట్ల పోలీసులు హైకోర్టు (High Court)లో దాఖలు చేశారు.
హైదరాబాద్: దంత వైద్యురాలు వైశాలి (Vaishali) కిడ్నాప్ కేసు (Kidnapping Case)లో కస్టడీ పిటిషన్‌ను ఆదిభట్ల పోలీసులు హైకోర్టు (High Court)లో దాఖలు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి (Naveen Reddy), మరో నలుగురిని వారం రోజులపాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నవీన్ రెడ్డితో పాటు మరో నలుగురిని నిన్న సరూర్‌నగర్ ఎస్‌వోటీ (SOT) కార్యాలయానికి తరలించి విచారించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. నవీన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మన్నెగూడ దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కొడుదుల నవీన్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సాయంత్రం గోవాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి, బుధవారం సాయంత్రం వరకు విచారణ చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని, అతడి నుంచి ఐదు సెల్‌ఫోన్లు స్వాధీం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అలాగే కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు.. చంద్రశేఖర్ అలియాస్ చందు, ప్రవీణ్, ప్రకాశ్, యశ్వంత్, మహేశ్‌లను నగరంలోని హస్తినాపూర్ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 39 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా రూమన్, పవన్ అనే మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నవీన్‌రెడ్డిపై మొత్తం 4 కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.