బస్తీల్లో ఆహ్లాదకర వాతావరణం

ABN , First Publish Date - 2022-12-16T00:32:09+05:30 IST

అభివృద్ధి పనులతో పాటు బస్తీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు.

బస్తీల్లో ఆహ్లాదకర వాతావరణం
పార్కు స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి తలసాని, అధికారులు

  • మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవు

  • చిదానందం కాలనీలో పార్కు పనులు ప్రారంభం

పద్మారావునగర్‌, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులతో పాటు బస్తీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. గురువారం పద్మారావునగర్‌లోని చిదానందం కాలనీలో రూ.31 లక్షల వ్యయంతో చేపట్టనున్న పార్కు నిర్మాణ, అభివద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలోని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పార్కులో వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌, చిల్డ్రన్స్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ స్థలం కోర్టు కేసులో ఉండగా ఇటీవల కాలనీవాసులకు అనుకూలంగా తీర్పు రావడంతో వారు మంత్రిని కలిసి పార్కు నిర్మాణం చేపట్టాలని కోరారు. స్పందించిన మంత్రి వెంటనే నిధులు మంజూరు చేయించి పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ హేమలత, పద్మారావునగర్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి గుర్రం పవన్‌కుమార్‌ గౌడ్‌, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్‌, వాటర్‌వర్క్స్‌ జీఎం రమణారెడ్డి, హర్టీకల్చర్‌ అధికారి రాఘవేందర్‌, శానిటరీ డీఈ శ్రీనివాస్‌, చిదానందం కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:32:11+05:30 IST