అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-07T15:38:25+05:30 IST

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంబర్‌పేట, చెన్నారెడ్డినగర్‌లో నివసిస్తున్న రమేష్‌ బొల్లారంలోని

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్/అంబర్‌పేట: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంబర్‌పేట, చెన్నారెడ్డినగర్‌లో నివసిస్తున్న రమేష్‌ బొల్లారంలోని సోలార్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడి భార్య మేఘన ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పనిచేస్తోంది. రోజూ మధ్యాహ్న సమయంలో రమేష్‌ భార్యను స్కూల్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు. సోమవారం మధ్యాహ్నం రమేష్‌ స్కూల్‌కు రాకపోవడంతో మేఘన తన మరిదికి ఫోన్‌ చేసి చెప్పింది. అతడు ఇంట్లోని పడకగదిలో చూడగా.. రమేష్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. అతడిని కిందికి దింపి చూడగా.. అప్పటికే మృతి చెందాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రమేష్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more