Hyderabad City: పార్టీ ఫుడ్‌..కొంచెం కొత్తగా..

ABN , First Publish Date - 2022-12-31T09:18:10+05:30 IST

వేడుకలంటే వినోదంతో పాటు విందు ఉండాల్సిందే. ఆ విందు కేవలం చికెన్‌ బిర్యానీ లేదంటే బేవరేజస్‌తో

Hyderabad City: పార్టీ ఫుడ్‌..కొంచెం కొత్తగా..

హైదరాబాద్‌ సిటీ: వేడుకలంటే వినోదంతో పాటు విందు ఉండాల్సిందే. ఆ విందు కేవలం చికెన్‌ బిర్యానీ లేదంటే బేవరేజస్‌తో ముగించాల్సిందేనా. సంప్రదాయ వంటకాలకు ఆధునిక హంగులు జోడించి కూడా కొంచెం ప్రత్యేకంగా విందు తయారు చేసుకోవచ్చు అంటున్నారు గోల్డ్‌డ్రాప్‌ సంస్థ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా.

శీతాకాలం, పైగా కొవిడ్‌ కాలం, కాస్త హెల్తీగా వేడుకను ప్రారంభిద్దామనుఉంటే కలోంజీ, సుమాక్‌ లాంటి స్పైసెస్‌ బెస్ట్‌ చాయిస్‌.

పార్టీలంటే కాక్‌టైల్స్‌ మాత్రమే కాదు మాక్‌టైల్స్‌తోనూ మజా చేసుకోవచ్చు. మాక్‌టైల్స్‌ ఆరోగ్యవంతంగా ఉండాలంటే జామపండు, టమోటా జ్యూస్‌ లాంటి వాటికి కాస్త కొత్తిమీర, జీలకర్ర పొడి, కొత్తిమీర జోడిస్తే మజా ఉంటుంది.

ఆరోగ్యకరమైన చిప్స్‌ కావాలంటే అరటి ఉత్తమం. ప్రయోగాలు చేయాలనుకుంటే, బెండీ పాప్‌కార్న్‌ ఉంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే బెండకాయ, కాస్త శెనగపిండి, పసుపు, కారం, ఉప్పు, నూనెతో ఈ పాప్‌కార్న్‌ చేసుకోవచ్చు.

ముక్క లేనిదే ముద్ద దిగని అలవాటు ఉన్న వారికి చికెన్‌ లేదంటే చేప ఉంది. ఫ్రైలు ఇష్టపడే వాళ్లు కాస్త నువ్వులు జోడిస్తే రుచి అమోఘం.

శాఖాహారుల కోసం సుందాల్‌ ఉంది. రజ్మా లేదంటే గ్రీన్‌ పీస్‌తో దీనిని తయారుచేస్తారు. ఉల్లిపాయ లేదంటే వెల్లుల్లి లేకుండా కొబ్బరి, స్పైసెస్‌ ఉపయోగించి దీనిని ఫ్రై చేస్తారు.

చికెన్‌, మటన్‌ బిర్యానీలకు కాస్త శాఫ్రాన్‌, రోజ్‌ వాటర్‌ లాంటివి జోడిస్తే రాయల్‌ టచ్‌ ఇవ్వొచ్చు.

థీమ్‌ పార్టీ అయితే..

వినూత్న నేపథ్యంతో పార్టీ చేసుకుంటే కొన్నాళ్లపాటు అది గుర్తుండిపోతుంది. ఈ న్యూ ఇయర్‌కు 80ల నాటి పార్టీ థీమ్స్‌ ట్రెండింగ్‌గా ఉన్నాయట. ఆ నాటి పాటలతో ఓ ప్లేలిస్ట్‌ చేసుకోవడంతో పాటుగా డెకార్‌ కూడా ఆ రీతిలో చేసుకుంటే అతిథులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వొచ్చు.

ఇంట్లో వేడుకలు జరిపే మగవారు పనుల్లో ఇల్లాలికి సహకరిస్తూ, పార్టీలో ఆమెను భాగస్వామ్యం చేస్తే వాతావరణం మరింత ఉత్సాహంగా ఉంటుంది.

Updated Date - 2022-12-31T09:34:12+05:30 IST