Hyderabad: పాత నేరస్థుడు అరెస్టు

ABN , First Publish Date - 2022-09-17T18:16:20+05:30 IST

చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్టు చేసి, ఒకటిన్నర తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌, ఆటో, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు

Hyderabad: పాత నేరస్థుడు అరెస్టు

ఒకటిన్నర తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌, ఆటో, బైక్‌ స్వాధీనం


హైదరాబాద్/కొత్తపేట: చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్టు చేసి, ఒకటిన్నర తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌, ఆటో, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌హెచ్‌ఓ అంజిరెడ్డి, డీఐ ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట ఆదర్శనగర్‌ కాలనీలో ఉండే నల్లగొండ మల్లేపల్లి జేతావత్‌ తాండా వాసి ఆటోడ్రైవర్‌ జేతావత్‌ వినోద్‌నాయక్‌ (25) జల్సాలకు బానిసై చోరీల బాట పట్టాడు. ఆటోలో తిరుగుతూ అవకాశం కోసం వేచి ఉండి చోరీలకు పాల్పడుతున్నాడు. అతడు పలు మార్లు నేరాల బాట వీడలేదు. 14 రోజుల క్రితం చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యాడు. ఈనెల 12వ తేదీన రాత్రి చింతలకుంట హైవే కాలనీలో ఉండే దేవరకొండ కృష్ణమూర్తి(62) తలుపు బోల్టు సరిగా వేయకుండా నిద్రపోయారు. తెల్లవారు జామున వినోద్‌నాయక్‌ ఆటోలో ఆ ఇంటి వద్దకు వచ్చాడు. ముఖానికి మాస్కు వేసుకుని అతడు తలుపు గట్టిగా నెట్టి లోనికి చొరబడి బీరువాలోని బంగారు నగలు, రూ.5 వేలు, సెల్‌ఫోను, ట్యాబు చోరీ చేసి వెళ్లే సమయం లో కృష్ణమూర్తి అతడిని చూసి గట్టిగా దొంగ దొంగా అంటూ కేకలు పెట్టాడు. సొత్తుతో అతడు తన ఆటోలో ఉడాయించాడు. 13వ తేదీ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తూ దొంగను గుర్తించారు. అత డు చోరీచేసిన బంగారం అమ్మేందుకు గురువారం సాయంత్రం ఎల్‌బీనగ ర్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు వచ్చాడు. అనుమానాస్పదంగా తచ్చాడుతున్న అత డిని క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గత నెల 2న వనస్థలిపురం పీఎస్‌ పరిధిలో కారు దొంగతనం కేసులో అతడిని కటకటాల్లోకి నెట్టారు. అమ్రాబాద్‌, అచ్చంపేట, గుంతకల్‌, వనస్థలిపురం, సైదాబాద్‌, బంజారాహిల్స్‌ పీఎస్‌లలో అతడిపై చోరీ కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది.

Updated Date - 2022-09-17T18:16:20+05:30 IST