పండ్ల మార్కెట్‌ స్థల పరిశీలన

ABN , First Publish Date - 2022-12-28T00:54:18+05:30 IST

పహాడిషరీఫ్‌ ఆర్‌సీఐ గేట్‌ వద్ద పండ్ల మార్కెట్‌కు కేటాయించిన స్థలాన్ని చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మోహినీద్దీన్‌, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మెహరా జ్‌, రాష్ట్ర వక్బర్‌ చైర్మన్‌ మసిహుల్లా ఖాన్‌ మంగళవారం సందర్శించారు.

పండ్ల మార్కెట్‌ స్థల పరిశీలన

పహాడీషరీఫ్‌, డిసెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): పహాడిషరీఫ్‌ ఆర్‌సీఐ గేట్‌ వద్ద పండ్ల మార్కెట్‌కు కేటాయించిన స్థలాన్ని చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మోహినీద్దీన్‌, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మెహరా జ్‌, రాష్ట్ర వక్బర్‌ చైర్మన్‌ మసిహుల్లా ఖాన్‌ మంగళవారం సందర్శించారు. పండ్ల మార్కెట్‌ స్థలం కోసం వక్ఫ్‌ బోర్డు నుంచి 12 ఎకరాల స్థలాన్ని కేటాయించిన జీవో కాపీని వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మసిహుల్లా ఖాన్‌, అక్బరుద్దీన్‌ ఒవైసీకి అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో అక్బరుద్దీన్‌ ఒవైసీ, మసీ ఉల్లాహ్‌ ఖాన్‌ మాట్లాడుతూ కొత్తపేట మార్కెట్‌ స్థలంలో ప్రభు త్వం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రభుత్వం నిర్మిస్తున్నందున పండ్ల మార్కెట్‌ను కొహెడాలో ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి వరకు పహాడిషరీఫ్‌ పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కమిషన్‌ ఏజెంట్లు హోం మంత్రి మహమూద్‌ అలీ, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఆక్బరుద్దీన్‌ ఒవైసీని కోరడంతో వారు ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోని వెళ్లగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశంలో మామిడిపల్లి రెవెన్యూ పరిధిలోని పహాడిషరీ్‌ఫలో వక్ఫ్‌ బోర్డు స్థలాన్ని పండ్ల మార్కెట్కు కేటాయించాలని తన కోరిక మేరకు సీఎం కేసీఆర్‌ స్థలం కేటాయించారన్నారు. పండ్ల వ్యాపారం చేసుకునే వారికి ఒక్కొక్కరికీ 300గజాల స్థలం చొప్పున ఇవ్వనున్నామన్నారు. 12 ఎకరాల స్థలానికి సంవత్సరానికి రూ. 4 లక్షలు అద్దె కింది ఇచ్చామని వారు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-28T00:54:32+05:30 IST